ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'RC16' గురించిన లేటెస్ట్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Tue, Apr 30, 2024, 03:35 PM



ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తన 16వ చిత్రాన్ని చేయనున్న సంగతి అందరికి తెలిసందే. ఈ చిత్రం పీరియాడికల్ డ్రామా అని సమాచారం. ఈ సినిమా షూటింగ్ జూలైలో ప్రారంభం కానుందని లేటెస్ట్ టాక్. తాజాగా ఇప్పుడు AR రెహమాన్ ఈ సినిమాకి ట్యూన్స్ ని రెడీ చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో రాజ్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాకి AR రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. గ్రామీణ స్పోర్ట్స్ డ్రామాగా రానున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్‌ పతాకంపై వెంకట సతీష్‌ కిలారు నిర్మిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com