ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'శబరి' గల్ఫ్ కంట్రీస్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్

cinema |  Suryaa Desk  | Published : Tue, Apr 30, 2024, 04:02 PM



అనిల్ కాట్జ్ దర్శకత్వంలో కోలీవుడ్ బ్యూటీ వరలక్ష్మి శరత్‌కుమార్మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌పై సంతకం చేసింది. ఈ సినిమాకి 'శబరి' అనే టైటిల్ ని మేకర్స్ లాక్ చేసారు. సైకలాజికల్ థ్రిల్లర్ ట్రాక్ లో రానున్న ఈ సినిమా మే 3న విడుదల కానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క గల్ఫ్ కంట్రీస్ రైట్స్ ని రేష్ రాజ్ ఫిలిమ్స్ LLC సొంతం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు.

ఈ చిత్రంలో  మైమ్ గోపీ, శశాంక్, సునయన, గణేష్ వెంకట్రామన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గోపీ సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. మహా మూవీస్ ఈ సినిమాని నిర్మిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com