ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'షైతాన్' డిజిటల్ ఎంట్రీకి తేదీ లాక్

cinema |  Suryaa Desk  | Published : Tue, Apr 30, 2024, 05:46 PM



బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ మరియు సౌత్ స్టార్స్ జ్యోతిక మరియు మాధవన్ నటించిన షైతాన్ మార్చి 8, 2024న విడుదల అయ్యింది. హారర్ థ్రిల్లర్ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమా పోస్ట్ థియేట్రికల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే.


తాజాగా ఇప్పుడు ఈ సినిమా మే 3, 2024న డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు డిజిటల్ ప్లాట్ఫారం అధికారికంగా ప్రకటించింది. షైతాన్ సినిమా సూపర్ హిట్ గుజరాతీ హారర్ థ్రిల్లర్ వాష్ యొక్క అధికారిక రీమేక్. ఈ చిత్రానికి వికాస్ బహ్ల్ దర్శకత్వం వహిస్తున్నారు.


ఈ సినిమాలో అజయ్ దేవగన్ పైలట్‌గా నటించగా, అజయ్ భార్యగా జ్యోతిక కనిపించనుంది. జియో స్టూడియోస్, దేవగన్ ఫిల్మ్స్ మరియు పనోరమా స్టూడియోస్ బ్యానర్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com