ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'తాండల్' సెట్స్ లో నాగ చైతన్య

cinema |  Suryaa Desk  | Published : Tue, Apr 30, 2024, 06:05 PM



చందూ మొండేటితో నాగ చైతన్య తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి "తాండల్" అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా నిర్మాణం జరుపుకుంటోంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా కొత్త షెడ్యూల్ ని ప్రారంభించారు. ఈ సినిమా సెట్స్ నుండి కొన్ని పిక్స్ ని చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది.

ఈ లవ్-యాక్షన్ డ్రామాలో సాయి పల్లవి కథానాయికగా నటించింది. ఈ చిత్రంలో చై మత్స్యకారునిగా కనిపించనున్నారు. ఈ చిత్రం 2018లో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళంలో జరిగిన వాస్తవ సంఘటనల నుండి స్ఫూర్తిని పొందింది. GA2 పిక్చర్స్‌ పతాకంపై బన్నీ వాస్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com